వడివేలు – విజయ్ కాంత్ మధ్య విభేదాలు రావడానికి కారణం..?

-

సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది కామన్ గా వస్తూనే ఉంటాయి. కానీ నటీనటులు ఖాళీగా ఉండకుండా ఎప్పుడు కూడా సినిమాలలో నటిస్తూ బిజీగా గడపాలని అనుకుంటూ ఉంటారు. అయితే సినిమాలు, రాజకీయాలు వేరు వేరు కాబట్టి కొన్ని కారణాలవల్ల నిజాయితీగా ఉన్నా సరే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా సినిమాలు వేరు , రాజకీయాలు వేరు అని చెప్పినందుకే వడివేలు – విజయకాంత్ మధ్య విభేదాలు తలెత్తాయి అన్న వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి.

ఇక అసలు విషయంలోకెళితే వడివేలు కమెడియన్ గా టాప్ పొజిషన్లో ఉన్నప్పుడే విజయ్ కాంత్ తన సినిమాలో ఒక క్యారెక్టర్ లో నటించే అవకాశం ఇచ్చారు. అప్పటికే విజయ్ కాంత్ టాప్ హీరో కావడం వల్ల ఆయన సినిమాలో వడివేలుకు మంచి వేషం కూడా లభించింది.ఇక ఆ సినిమాలోని ఒక సన్నివేశంలో భాగంగా వడివేలు.. విజయకాంత్ సీఎం అవుతాడు అని ఒక డైలాగ్ ఉంది. దాన్ని గట్టిగా అరుస్తూ చెప్పాలని దర్శకుడు చెప్పడంతో వడివేలు కొంచెం కోపం తెచ్చుకొని సినిమా వేరు, రాజకీయం వేరు.. రాజకీయాన్ని.. సినిమాని ఒక దాంట్లో పోల్చి ఎందుకు చూస్తున్నారు ఇప్పుడు మీరు చెప్పినట్టు.. నేను ఇలా డైలాగ్ చెప్తే ఆపోజిషన్ పార్టీలో ఉన్న డిఎంకె , అన్నా డిఎంకె పార్టీలకు చాలా ఇబ్బంది కలుగుతుంది వారి మనోభావాలు దెబ్బతింటాయి అంటూ గొడవ పెట్టుకున్నారట.

దాంతో కోపం తెచ్చుకున్న విజయ్ కాంత్ నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు.. మేమేం చెప్తే అది చేయాలి అని అన్నారట. అయితే దానికి వడివేలు నువ్వు డబ్బులు ఇస్తే కొంతమంది నువ్వు చెప్పినట్టు పేర్లు చెబుతారేమో కానీ.. డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఏది పడితే అది నేను చెప్పలేను అని అనడంతో విజయకాంత్.. వడివేలు కాలర్ పట్టుకున్నాడట. దాంతో కోపం తెచ్చుకున్న వడివేలు అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. ఇక ఆ సినిమాలో వడివేలు లేకుండానే షూటింగ్ పూర్తి చేసి సినిమా రిలీజ్ చేశారు. అలా వడివేలు, విజయకాంత్ మధ్య వాగ్వాదం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news