నగ్మాని ఆ నటుడు బెదిరించడానికి కారణం..?

-

తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ నగ్మా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిందని చెప్పవచ్చు. ఇప్పటికీ 50 సంవత్సరాల పైన కావోస్తున్న ఇంకా వివాహం చేసుకోలేదు. అయితే గతంలో ఆమె పైన ఎన్నో రూమర్స్ ఎఫైర్ వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అలాంటి వాటి పైన ఎప్పుడూ కూడా నగ్మా స్పందించలేదు. అయితే నగ్మా ఒక నటుడు ప్రేమించి బ్రేకప్ అయిన తర్వాత చాలా ఇబ్బంది పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి పూర్తి వివరాలు మనకు తెలుసుకుందాం.

తమిళంలో స్టార్ హీరోగా పేరు సంపాదించిన శరత్ కుమార్ ప్రస్తుతం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా ఉన్నారు. శరత్ కుమార్ హీరోగా నటించడానికి కంటే ముందు ఒక భారీ బిల్డర్ గా ఉండేవారట. తన మొదటి సినిమా సమాజంలో స్త్రీ సినిమాని తెలుగులో నటించాడు. ఆ తర్వాత నెమ్మదిగా పలు సినిమాలలో విలన్ గా నటించారు. తనలోని నటనతో తమిళ ఇండస్ట్రీలో హీరోగా అవకాశాలను సంపాదించుకున్నారు. అలా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వట్టి భాషలలో కూడా ఎన్నో సినిమాలలో నటించాడు శరత్ కుమార్.

నగ్మాతో కలిసి ఒక సినిమా చేస్తున్న సమయంలో ఈమెతో ప్రేమలో పడినట్లుగా వార్తలు వినిపించాయి. అయితే అప్పటికే శరత్ కుమార్ ఛాయా అనే ఒక అమ్మాయిని వివాహం చేసుకొని ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. కానీ నగ్మా తో కలిసి అనేక సినిమాలలో నటిస్తూ ఆమెతో రహస్య బంధాన్ని ఏర్పరచుకున్నారట శరత్ కుమార్. ఇక వీరి గురించి అప్పట్లో మీడియాలో పలు రకాలుగా వార్తలు వినిపించాయి. దీంతో శరత్ కుమార్ భార్య వీరిద్దరి పైన చాలా సీరియస్ అయ్యి.. శరత్ కుమార్ నుంచి విడిపోవాలని డైవర్స్ కి కూడా అప్లై చేసిందట. దీంతో తన భార్యతో బంధాన్ని నిలుపుకోలేకపోయారు శరత్ కుమార్. ఆ తర్వాత నగ్మాని వివాహం చేసుకోవాలనుకున్న ఛాయా తో విడాకుల విషయం తెలియగానే నగ్మా ఒప్పుకోలేదట. అయినా కూడా శరత్ కుమార్ నగ్మా అని వదలకుండా పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరిస్తూ వార్నింగ్ ఇచ్చేవారట. దీంతో నగ్మా కొన్ని రోజులు బయటికి కూడా రాలేదని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version