సన్నీ యాదవ్‌ను త్వరలోనే అరెస్టు చేస్తాం :డీఎస్పీ రవి

-

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన వారిపై తెలంగాణ ప్రభుత్వం క్రమంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ ట్వీట్‌తో ఏపీలో యూట్యూబర్, ఫిషర్ మ్యాన్ నానిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో యూట్యూబర్, ఇన్ ఫ్లూయెన్సర్ సన్నీ యాదవ్ మీద రెండ్రోజుల కింద కేసు ఫైల్ అయ్యింది.

ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాజాగా సన్నీ యాదవ్ ప్రొఫైల్‌‌ను చెక్ చేసిన పోలీసులు.. అతని ఖాతాలో చాలా వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వీడియోలను గుర్తించారు. దీనిపై సూర్యాపేట జిల్లా డీఎస్పీ మాట్లాడుతూ..బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన సన్నీ యాదవ్‌పై నూతన్ కల్ పీఎస్‌లో కేసు ఫైల్ చేశామని, విచారణ జరిపి త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ రవి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version