బాలీవుడ్ స్టార, కార్తికేయ మూవీ నటుడు అనుపమ్ ఖేర్ ఆఫీస్‌లో తాజాగా చోరీకి పాల్పడ్డారు. డబ్బులను దాచే సేఫ్ లాకర్‌తో పాటు ఓ మూవీ నెగెటివ్‌ను ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని అనుపమ్ ఖేర్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు.
ముంబయిలోని వీర దేశాయ్ రోడ్‌లోని అనుపమ్ ఖేర్ ఆఫీస్‌లో ఎవ్వరూ లేని సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి అక్కడే ఉన్న లాకర్‌తో పాటు ఓ ఫిల్మ్ నెగిటివ్‌ను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఓ ఆటోలో పరారయ్యారు. ఇదంతా ఆఫీస్ బయట ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అనుపమ్ ఖేర్ ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా దొంగలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ అనుపమ్ ఖేర్ ఓ వీడియో ద్వారా సోషల్ మీడియాలో తెలిపారు. త్వరలోనే ఆ దొంగల్ని పట్టుకుంటామంటూ తెలిపిన ఆయన, తన వద్గ ఆటో నంబర్ కూడా ఉందని అన్నారు.