Bigg Boss Telugu 8 : 3వ వారం ఓటింగ్ లో టాప్‌లో ఊహించని కంటెస్టెంట్.. చేతులారా ప్రమాదంలో పడ్డ అభయ్..?

-

Bigg Boss Telugu 8 :  బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికి రెండు వారాల్లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు మూడవ వారం నామినేషన్స్ పూర్తయ్యాయి. ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ షో తెలుగులో ఎప్పుడు రన్ అయినా సక్సెస్ అవుతుంది. అందుకే ఏడు సీజన్లని ఒకదానికి మించి ఒకటి భారీ రేటింగ్స్ ని సాధించింది. 14 మంది కంటెస్టెంట్స్ రాగా ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. 12 మంది ఇంకా కొనసాగిస్తున్నారు.

ఈసారి నామినేట్ అయిన ఇంటి సభ్యుల్లో అభయ్, విష్ణుప్రియ, సీత, యష్మి గౌడ, నాగమణికంఠ, పృథ్వీరాజ్, ప్రేరణ, నైనిక ఉన్నారు. అయితే టాప్ లో ఎవరున్నారు అనేది అసలు ఎవరు ఊహించలేరు. ముఖ్యంగా టాప్ టు లో ఎవరున్నారు అనేది అందరికీ షాకింగ్ గా ఉంది. టాప్ లో విష్ణుప్రియ ఉండగా రెండవ స్థానంలో నాగమణికంఠ ఉన్నాడు.

8వ సీజన్ మూడవ వారంలో జరుగుతున్న ఓటింగ్ లో విష్ణుప్రియ, మణికంఠ ప్రస్తుతానికి టాప్ రెండు ప్లేసులలో ఉన్నారు. సీత మూడవ స్థానంలో ఉంది. నైనిక నాలుగవ స్థానంలో యష్మీ ఐదవ స్థానంలో ఉన్నారు. ఆరవ స్థానంలో ప్రేరణ, ఏడవ స్థానంలో పృథ్వీరాజ్, ఎనిమిదవ స్థానంలో యాభై ఉన్నారు. ఈ ముగ్గురు డేంజర్ లో ఉన్నారని చెప్పొచ్చు. చీఫ్ అయిన అభయ్ తాజా నామినేషన్స్ లో నిఖిల్ కోసం త్యాగం చేసి తన గొయ్యి తానే అవుకున్నాడా?

Read more RELATED
Recommended to you

Latest news