కేజీఎఫ్ బ్యూటీ ఫిట్నెస్ వెనుక దాగి ఉన్న రహస్యం ఇదే..!

-

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.. కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా .. శ్రీనిధి హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం కేజిఎఫ్.. ఇక ఈ సినిమా ఎలాంటి కలెక్షన్ సాధించిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. పాన్ ఇండియా రేంజ్ లో ఈ నటీనటులకు , దర్శకులకు మంచి గుర్తింపు లభించింది . ముఖ్యంగా శ్రీనిధి నటన ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆమె పర్సనాలిటీకి అందానికి అందరూ కూడా ఫిదా అయిపోయారు. ఇక ఈ క్రమంలోనే శ్రీనిధి అందం , ఫిట్నెస్ వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకోవాలని అందరూ అంతగా ఆరాటపడుతున్నారు.. మరి ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

నిజం చెప్పాలంటే శ్రీనిధి మంచి భోజనం ప్రియురాలు. ఫిట్గా ఉండడానికి మాత్రం ఆమె డైట్ ఫాలో అవుతుంది. ఎక్కువగా ఆమె ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంది. ఇక భోజనం కూడా చాలా సింపుల్ గానే ఉండడానికి ఇష్టపడుతుంది. నిజానికి భోజన ప్రియురాలు అయినప్పటికీ ఇండస్ట్రీలో ఉండడం వల్ల తన బాడీ ని ఫిట్గా ఉంచుకోవాలని.. మంచి ఆహారపు అలవాట్లను తీసుకుంటూ పలు జాగ్రత్తలు తీసుకుంటుందట. ఇక ప్రతిరోజు కచ్చితంగా జిమ్ కి వెళ్లడం తాను తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, పిండి పదార్థాలు, పండ్లు ,కూరగాయలు ఉండేలా చూసుకోవడం ,వ్యాయామం చేయడం లాంటివి తప్పకుండా చేస్తుందట . ఇక చర్మం కోసం కచ్చితంగా ఉదయం , రాత్రి స్కిన్ కేర్ రొటీన్ ని ఫాలో అవుతూ ఉంటుందట శ్రీనిధి.

ఇక మధ్యాహ్నం భోజనం 12 గంటల సమయంలో అల్పాహారం కంటే ప్రారంభ మధ్యాహ్న భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడతారట. ఇందులో అన్నం , కూర లేదా చపాతి, సబ్జి ఉండేలాగా చూసుకుంటారట. ఇక లంచ్ డిన్నర్ లో ఆహారం చాలా తేలికగా ఉండేలా చూసుకోవడంతో పాటు ప్రోటీన్స్ కలిగిన ఆహారం మాత్రమే తీసుకుంటుందట. అయితే తాను తయారు చేసుకున్న ఆహారాన్ని మాత్రమే ఆమె ఎక్కువగా ఇష్టపడుతుందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version