సిద్ధిపేట జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో చేపల వేట కోసం వేసిన వలలో మత్స్యకారులకు భారీ కొండచిలువ చిక్కింది. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది. కొండచిలువను చెరువు కట్ట పైకి తీసుకువచ్చిన మత్స్యకారులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.
దీంతో ఫారెస్ట్ అధికారులు వల నుండి కొండచిలువను విడిపించారు. అనంతరం కొండచిలువను అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలిపెడతామని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మహమ్మద్ అమిద్ తెలిపారు. జాలర్లకు కొండచిలువ చిక్కిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అసలు ఎల్లమ్మ చెరువులోకి కొండచిలువ ఎలా వచ్చిందనే విషయంపై స్థానికుల్లో చర్చ జరుగుతోంది.
చేపల వలకు చిక్కిన భారీ కొండచిలువ….
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో చేపల వేటకు వేసిన వలలో మత్స్యకారులకు భారీ కొండచిలువ చిక్కడం స్థానికంగా కలకలం రేపింది.
కొండచిలువను చెరువు కట్ట పైకి తీసుకువచ్చి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు వల నుండి… pic.twitter.com/HjAC1QfaTo
— ChotaNews (@ChotaNewsTelugu) November 24, 2024