మాజీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌ వల్లే శివసేనకు ఈ గతి పట్టింది : సంజయ్ రౌత్

-

మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమికి భారీ మెజార్టీ దక్కిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారం దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. సోమవారం మహాయుతి కూటమి తరఫున సీఎంగా ఎవరు ప్రమాణస్వీకారం చేస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోసారి శివసేన నేత షిండేకు చాన్స్ ఇస్తారా? మాజీ సీఎం ఫడ్నవిస్‌కు సీఎం చాన్స్ దక్కుతుందా? అనేది తెలియాల్సి ఉంది.

మహారాష్ట్ర ఫలితాలపై తాజాగా శివసేన యూటీబీ నేత సంజయ్ రౌత్ స్పందించారు. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ వల్లే రాష్ట్రంలో ఇలాంటి ఫలితాలు వచ్చాయన్నారు. దీనికి ఆయనే బాధ్యత వహించాలన్నారు. శివసేన ఎమ్మెల్యేల అనర్హత కేసులో తీర్పు చెప్పకుండా చంద్రచూడ్ నాన్చడం వల్లే ఈ తరహా ఫలితాలు వచ్చాయన్నారు. సరైన సమయంలో తీర్పు చెప్పి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవని, చంద్రచూడ్‌ను చరిత్ర క్షమించదంటూ సంజయ్ రౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన వల్లే శివసేన పార్టీకి ఈ గతి వచ్చిందని పరోక్షంగా చురకలంటించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version