పవర్ స్టార్ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్.. జూన్ 30న తొలిప్రేమ మూవీ రీ రిలీజ్

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో ది బెస్ట్ సినిమాల గురించి చెప్పుకుంటే అందులో తొలిప్రేమ తప్పకుండా ఉంటుంది. ఈ కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం పవర్​స్టార్​కు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. కరుణాకరన్ డైరెక్షన్​లో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి రెడ్డి హీరోయిన్​గా నటించింది. ఇక ఈ సినిమాలో బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్​ హైలైట్. అప్పట్లోనే ఈ సినిమా తొమ్మిది కోట్ల షేర్‌ను సాధించి అల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది.

అయితే తాజాగా ఈ చిత్ర మేకర్స్.. పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఆల్టైమ్ క్లాసిక్​ను రీ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. జూన్‌ 30న ఈ సినిమా 4K ప్రింట్‌తో రీ-రిలీజ్‌ కానుంది. ఈ విషయం తెలిసి పవన్ ఫ్యాన్స్ తెగ సంబుర పడిపోతున్నారు. ఈసారి కూడా ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తుందని సినీ వర్గాల్లో టాక్.

Read more RELATED
Recommended to you

Exit mobile version