‘డీజే టిల్లు’ను మించి టిల్లు స్క్వేర్లో ‘టికెటే కొనకుండా’ సాంగ్.. ప్రోమో రిలీజ్

-

డీజే టిల్లు సినిమా గుర్తింది కదా. ఇప్పటికీ ఆ సినిమాలోని టిల్లు అన్నా డీజే పెడితే పాట ప్రతి ఫంక్షన్ లో ప్రతి ఈవెంట్ ప్రతి పెళ్లి బరాత్ లో మార్మోగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ లోనూ డీజే టిల్లు పాటను మించిన మరో పాటను రెడీ చేశారు మేకర్స్. ఆ పాటే టికెటే కొనకుండా అంటూ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ పాట ప్రోమోను వదిలారు మేకర్స్.

సిద్దు షూస్‌ క్లీన్ చేస్తూ.. మనసు విరిగినట్టున్నది ఎక్కడ్నో.. ఉన్నడా బాయ్‌ఫ్రెండ్‌.. అంటూ అనుపమతో సిద్దు చిట్‌ చాట్‌ చేస్తున్న వీడియోతో సాంగ్‌ ప్రోమో అప్‌డేట్ అందించారు మేకర్స్. జులై 26న ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేయనున్నారు. ఈ ప్రోమో విడుదలైన క్షణాల్లోనే లక్షల్లో వ్యూస్ సంపాదించింది. ఇక బరాత్ కు మరో మాస్ సాంగ్ వచ్చేసిందిరోయ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఈ సారి డబుల్‌ డోస్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ ఉండబోతున్నట్టు ప్రోమోతోనే క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్‌. ఈ మూవీని సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డైరెక్టర్ మల్లిక్ రామ్  తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version