ట్విటర్ లో మరో భారీ మార్పు.. X.COM గా మారిన వెబ్​సైట్​​!

-

అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విటర్ తో ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు. ఓసారి మార్పులు చేస్తూ.. మళ్లీ ఊరికే జోక్ చేశా అన్నట్లు ముందుగా ఉన్నట్లే ఉంచుతూ.. ఇలా రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ట్విటర్ వెబ్ సైట్ ను x.comకు అనుసంధానం చేసినట్లు ప్రకటించారు మస్క్. ఇప్పటికే బ్లూబర్డ్ లోగోను మార్చేసిన ఎలాన్​ మస్క్​.. దాని స్థానంలో X సింబల్​ లోగోను తీసుకొచ్చారు.

ఎలాన్​ మస్క్​కు X అంటే చాలా ఇష్టం. 1990 సంవత్సరం నుంచే మస్క్​కు Xతో బాగా అనుబంధం ఉంది. ఇది తన సెంటిమెంట్ అని కూడా ఆ సందర్భంలో మస్క్ పేర్కొనడం విశేషం. అందుకే తను ప్రారంభించిన కంపెనీల్లో X అక్షరం వచ్చేలా చాలా జాగ్రత్త తీసుకుంటారు. అంతరిక్ష ప్రయోగాల కోసం 2022లో ప్రారంభించిన సంస్థ SpaceX; ఎలక్ట్రిక్​ కారు మోడల్​ X, చివరకు తన కుమారుల్లో ఒకరికి పెట్టిన పేరులోనూ (ఎక్స్ ఏఈ ఏXII) X అనే పదాన్ని వదలలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version