టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో ముందు వినిపిస్తున్న పేర్లు పూజా హెగ్డే, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. సరిలేరు నీకెవ్వరు సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన రష్మిక మందన్న నటిస్తే అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటించింది. రష్మిక మందన్న నటించిన సినిమ హిట్ అయితే, పూజా హెగ్డే నటించిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాంతో మళ్ళీ ఇద్దరికీ స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ వచ్చింది. రష్మిక మందన్న సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంటే పూజా హెగ్డే కొరటాల శివ-మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే ఛాన్స్ ని దక్కించుంది.
అంతేకాదు తాజాగా ‘ది మ్యాగజైన్’ అనే పత్రిక కోసం ఫోటో షూట్ చేసింది పూజా హెగ్డే. ఇలా ఒకవైపు స్టార్ హీరోల సినిమాలు మరో వైపు ఫొటో షూట్స్ తో పూజా బాగా సంపాదిస్తోంది. ఇవి కాకుండా ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ సినిమాని కమిటయింది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన పూజా హెగ్డే మంచి ఛాన్స్ దక్కించుకుంది. ఇక ఈ సినిమాకి అలాగే కొరటాల చిరంజీవి మహేష్ బాబు సినిమాకి పూజా హెగ్డే రెమ్యూనరేషన్ భారీగా అందుకుంటుందట. ఇది ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే పూజా హెగ్డే తో పాటు వరుసబెట్టి అవకాశాలను దక్కించుకుంటున్న రష్మిక మందన్న ఇప్పుడు హాట్ హాట్ గా ఉందట. అదీ కూడా పూజా హెగ్డే మీద.
అందుకు కారణం పూజా హెగ్డే రేంజ్ లో రష్మిక మందన్న కి రెమ్యూనరేషన్ దక్కకపోవడం. అంతేకాదు తనకి వచ్చిన కొన్ని సినిమా ఛాన్సులని పూజా హెగ్డే ఎగరేసుకుపోతుందట. అటు రష్మిక మందన్న అవకాశాలు పూజా హెగ్డే కొట్టేస్తూ రెమ్యూనరేషన్ భారీగా అందుకుంటూ గట్టి పోటీ ఇస్తుంటే రష్మిక మందన్న పూజా హెగ్డే మీద కుళ్ళు తో అల్లాడిపోతుందట. నాకు తనకి తేడా ఏంటి అని తన సన్నిహితుల దగ్గర రుస రుస లాడుతూ వాపోతుందట. నిజమే ఆ లెక్కన చూస్తే ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో పూజా హెగ్డే కి ఉన్న డిమాండ్ మామూలుది కాదు. ఈ విషయంలో ఒక్క రష్మిక మందన్న కాదు మిగతా హీరోయిన్స్ కూడా ఏడవడం ఖాయం.