బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం విషయంలో ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మరణం వెనుక రాజకీయ నాయకులు కూడా ఉన్నారని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్న సంగతి స్పష్టంగా చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ వ్యవహారంలో ఒక బాలీవుడ్ స్టార్ హీరో జోక్యం కూడా ఉంది అనే ఆరోపణలు బాలీవుడ్ నుంచి నేరుగా వినబడుతున్నాయి.

బాలీవుడ్ కి చెందిన ఒక స్టార్ హీరో సుశాంత్ సింగ్ కి 10 కోట్ల వరకు బాకీ పడ్డాడు అనే వార్తలు గుప్పుమంటున్నాయి. రియా చక్రవర్తి ద్వారా అతను పది కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా రియా చక్రవర్తి ఉంది అని ఈడికి ఫిర్యాదులు వెళ్లినట్టు మహారాష్ట్ర మీడియా అంటోంది. ప్రస్తుతం రియా చక్రవర్తి కి సంబంధించిన 15 కోట్ల విచారణ జరుగుతోంది. సుశాంత్ సింగ్ దగ్గర ఆమె తీసుకున్న 15 కోట్లలో 10 కోట్లు ఒక స్టార్ హీరోకి ఇచ్చింది అని ఈడీ సమాచారం సేకరించినట్లు వార్తలు వస్తున్నాయి.