పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే 25 ఏండ్ల భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకొని.. గ్రేటర్ హైదరాబాద్ సిటీ మంచి నీటి సరఫరాకు సరిపడే మౌళిక సదుపాయాల ప్రణాళికను తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి జలమండలి అధికారులను ఆదేశించారు. సిటీ ప్రజలకు సమర్థవంతంగా మంచినీటి సరఫరా చేసే ప్రణాళికలు ఉండాలన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్ లో తాజాగా హైదరాబాద్ జలమండలి బోర్డు సమావేశం జరిగింది.
రాష్ట్రం ఏర్పడిన తరువాత బోర్డు సమావేశం కావడం తొలి సారి. సమావేశంలో సిటీ విస్తరణను దృష్టిలో పెట్టుకొని 2050 నాి అవసరాలకు సరిపడేలా ప్యూచర్ ప్లాన్ ఉండాలని సీఎం అధికారులకు దిశా నిర్దేశం చేసారు. ఇంటింటికీ తాగు నీటితో పాటు సీవరేజీ ప్లాన్ ను రూపొందించాలని.. అవసరమైతే ఏజెన్సీ, కన్సల్టెన్సీలతో అధ్యయనం చేయించాలని సూచించారు. జలమండలి ఆదాయ వ్యయాలు ఆశాజనకంగా లేవని.. వీటిని అధిగమించేందుకు ఆర్థిక శాఖ సమన్వయంతో తక్షణ కార్యచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సీఎం ఆదేశించారు.