లావణ్య రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్.. మస్తాన్ సాయి అరెస్ట్ !

-

లావణ్య రాజ్ తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.  ముఖ్యంగా డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. గుంటూరు జిల్లాలో మస్తాన్ సాయిని అరెస్ట్ చేసారు ఏపీ స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో.జూన్ 3న విజయవాడ రైల్వే స్టేషన్ లో డ్రగ్స్ తరలిస్తుండగా దాడులు చేసారు సెబ్ పోలీసులు. పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు మస్తాన్ సాయి. మస్తాన్ సాయి పై నిఘా పెట్టి మస్తాన్ దర్గా లో తలదాచుకుండగా అరెస్ట్ చేసారు పోలీసులు.

లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారం లో మస్తాన్ సాయి వెలుగు లోకి వచ్చాడు. మస్తాన్ సాయి ఫోన్ లో చాలా మంది అమ్మాయి ల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. పలువురు అమ్మాయిలకు సంబంధించి ప్రయివేటు వీడియోలు చిత్రకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మస్తాన్ సాయి మొబైల్ లో వీడియోలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.ఏపీ, తెలంగాణా కి చెందిన అమ్మాయిలను టార్గెట్ గా చేసుకొని మస్తాన్ సాయి మోసం చేస్తున్నట్లు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news