తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటి పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గత కొంతకాలంగా నరేష్ తో సహజీవనం అంటూ వార్తల్లో నిలిచిన ఈమె కొన్ని వారాల క్రితం పీహెచ్డి చేసేందుకు బళ్లారి లోని హంపి కన్నడ యూనివర్సిటీలో ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. ఇకపోతే ఈ ఎగ్జామ్ లో ఆమె ఉత్తీర్ణురాలు అయినట్లు వార్తలు వచ్చాయి. రిజల్ట్ పట్ల సంతోషంగా ఉన్నట్లుగా కూడా సమాచారం.
కానీ ఇంతలోపే ఊహించని షాక్ ఆమెకు తగిలిందట. అసలు విషయంలోకి వెళితే.. కన్నడ సాహిత్యంలో పీహెచ్డి కోసం ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసిన పవిత్ర లోకేష్ ఉత్తీర్ణత సాధించింది కానీ యూనివర్సిటీలో సీటు పొందేందుకు అవసరమైన ర్యాంకు ఆమెకు రాలేదట.. దీంతో అర్హత సాధించిన అభ్యర్థులు ఫైనల్ లిస్టులో పవిత్ర పేరు లేకపోవడం గమనార్హం. మాతృభాష సాహిత్యంలో పి.హెచ్డీ చేయాలనుకున్న పవిత్ర లోకేష్ కలలకు అడ్డుకట్ట వేసినట్లు తెలుస్తోంది.
పవిత్ర లోకేష్ రిజల్ట్ పై యూనివర్సిటీ రిజిస్ట్రార్ స్పందిస్తూ పవిత్ర లోకేష్ ఉత్తీర్ణత సాధించారు కానీ ఆమె సరైన ర్యాంకు సాధించకపోవడంతో సీటు పొందలేదు అని స్పష్టం చేశారు. మొత్తానికైతే పవిత్ర నిరాశలో మిగిలిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే మరి ఆమెకు పిహెచ్డి ఇంకోసారి చేసే అవకాశం ఉందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.