అన్ స్టాపబుల్ -4 : డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు షాకిచ్చిన ‘ఆహా’

-

హనుమాన్ మూవీతో అగ్ర దర్శకులలో ఒకరిగా పేరు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మకు ‘ఆహా’యాప్ యాజమాన్యం షాకిచ్చినట్లు తెలుస్తోంది. నందమూరి బాలయ్య హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షోను ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు మూడు సీజన్స్ విజయవంతంగా రన్ అయ్యాయి. తాజాగా నాలుగో సీజన్ ప్రారంభమైంది. దీనికి మొదటి అతిథిగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుగా గారు విచ్చేశారు.

కాగా, గత 2 సీజన్స్‌ ట్రైలర్ కట్‌ను ప్రశాంత్ వర్మే చూసుకున్నట్లు టాక్. అప్పుడు రెమ్యునరేషన్ రీజనబుల్‌ గానే అడిగారట. కానీ ఇప్పుడు అమాంతం పెంచేసినట్లు తెలుస్తోంది. నాలుగో సీజన్ ట్రైలర్‌ కట్ కోసం ‘ఆహా’ టీం ప్రశాంత్ వర్మను సంప్రదించగా రూ.2 కోట్లు డిమాండ్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి.చిన్న కట్ కోసం ఇంత పెద్ద మొత్తంలో డిమాండ్ చేయడం ఆహాకు ఓనర్స్‌కు నచ్చలేదట. అందుకే ‘అన్‌స్టాపబుల్ 4’ నుంచి ప్రశాంత్ వర్మను దూరం పెట్టారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version