వరల్డ్‌లోనే అత్యంత కాలుష్య భరిత సిటీగా పాకిస్థాన్‌లోని లాహోర్ నిలిచింది. గతంలో కూడా టాప్ కాలుష్య నగరంగా ఉన్న లాహోర్ మరోసారి తన స్థానాన్ని నిలుపుకుంది. ప్రస్తుతం లాహోర్‌లో ఏక్యూఐ (Air Quality Index) 708కి చేరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో పోల్చితే లాహోర్ గాలి నాణ్యత 86.2 రెట్లు అత్యంత దారుణ స్థాయికి పడిపోయిందని నివేదికలో వెల్లడైంది.
దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. లాహోర్‌లో ఎమర్జెన్సీ ప్రకటించింది. పౌరులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, తమ ఇళ్లలోని కిటికీలను, ఇంటి తలుపులను మూసివేయాలని ఆదేశించింది. పాఠశాలల వేళల్లోనూ మార్పులు చేశారు. విద్యాసంస్థలన్నీ పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు వహించాలని కోరింది.పంట తగులబెట్టడం, వాహనాల నుంచి వెలువడే కాలుష్యం, కాలం చెల్లిన పారిశ్రామిక పద్ధతులు వల్ల ఈ స్థాయిలో కాలుష్యం ఏర్పడినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. లాహోర్ ఒక్కటే కాకుండా పాక్‌లోని గుల్బర్గ్‌లో 953, పాకిస్తాన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ వద్ద 810,సయ్యద్ మరాతాబ్ అలీ రోడ్‌లో 784 ఏఐక్యూ రీడింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.