ప్రయాణికుల బాధలను ఇంకెప్పుడు పట్టించుకుంటారు? : రాహుల్ గాంధీ

-

దీపావళి పండుగ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయిన విద్యార్థులు, ఉద్యోగస్తులు, కార్మికులు, కూలీలు సొంతూర్లకు పయనమవుతుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ప్రజలు టికెట్ ధర తక్కువగా ఉండటంతో భారతీయ రైల్వేను తమ ప్రయాణ సాధనంగా ఉపయోగించుకుంటుంటారు. అయితే, పండుగల టైంలో రైల్వేలో రద్దీ ఎక్కువగా ఉంటుంది.

ఫలితంగా ప్యాసింజర్స్ నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రైల్వే ప్రయాణికుల పడుతున్న ఇబ్బందులపై తాజాగా ఎక్స్ వేదికగా స్పందించారు. దీపావళికి కోట్లాది భారతీయులు రైళ్లలో ప్రయాణిస్తారు. కూలీల నుంచి పారిశ్రామిక వేత్తల వరకూ ప్రతి భారతీయుడు రైల్వే మార్గాన్ని అనుసరిస్తారు. కానీ..అందరికీ అందుబాటులో ఉండాల్సిన రైల్వే సౌకర్యాలు దెబ్బతిన్నాయి.పేదలను గమ్యస్థానాలకు చేర్చే రైల్వే వ్యవస్థ..ఇప్పుడు వారి అవసరాల్ని తీర్చలేకపోతోంది. రైల్వే వ్యవస్థలోని లోపాలను, దానిని మరింత మెరుగుపరిచేందుకు మీరు కూడా మీ సూచనలు, అనుభవాలను మాకు చెప్పండని’ రాహుల్ గాంధీ నెటిజన్లను కోరారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version