Unstoppable with NBK promo : బాల‌య్య తో సంద‌డి చేసిన రాజ‌మౌళి

-

నందమూరి హీరో బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ప్లాట్ ఫామ్ లో unstoppable with nbk అని షో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షో కు చాలా మంది సినీ ప్రముఖులు వచ్చారు. తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సంగీంత దర్శకుడు ఎం ఎం కీరవాణి వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో ను విడుదల చేశారు. ఈ ప్రోమో లో హీరో బాలకృష్ణ రాజమౌళిని చిలిపి ప్రశ్నలు అడిగాడు. తనతో సినిమా చేయాలని అభిమానులు అడుగుతున్న ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. మీ డైరెక్షన్ లో నా సినిమా ఉంటుందా లేదా అని కూడా అడిగాడు.

దీనికి మౌనంగానే తెలుపుతూ సమాధానం చెప్ప‌లేక పోయాడు. డైరెక్టర్ రాజమౌళి చివరగా ఇది promo అందరికీ తెలిసిందే. కానీ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఎపిసోడ్ లో చెబుతాను అంటూ సమాధానమిచ్చాడు. అలాగే రాజమౌళి టాలెంటెడ్ పర్సన్ చాలా మందికి తెలుసు అయినా ఎందుకు గడ్డం పెంచుతున్నారు అని బాలయ్య రాజమౌళి ని అడిగాడు. దీనికి సమాధానం కూడా ఎపిసోడ్ లోనే చెబుతాను అని రాజమౌళి చెప్పాడు. అయితే ఈ 5 వ ఎపిసోడ్ డిసెంబర్ 17న ఆహా ఓ టి టి ఫ్లాట్ ఫాం లో ప్రసారం కాబోతుంది. అయితే రాజమౌళి – బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా ఉంటుందా అనే ప్రశ్నకు సమాధానం లభిస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version