రామ్‌చరణ్ భార్య యూట్యూబ్ ఛానల్ చూశారా.. చూడకపోతే చూడండి..!

-

ఉపాసన కామినేని కొణిదెల.. రామ్ చరణ్ భార్యగా పెద్దగా పరిచయం అవసరం లేని వ్యక్తి. రామ్ చరణ్ భార్యగానే కాదు, అపోలో లైఫ్ ఎండీగానూ ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతే కాదు.. ఆమె ఓవైపు ఓ పెద్ద గ్రూపు ఆసుపత్రులకు ఎండీగా ఉంటూనే తన మనసుకు నచ్చిన పని చేస్తున్నారు.

అదే ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించడం.. అవును ఆమె తన పేరుతోనే యూట్యూబ్ ఛానలను నిర్వహిస్తున్నారు. అదే ఉపాసన కామినేని కొణిదెల యూట్యూబ్ ఛానల్.. ఈ ఛానల్ ద్వారా అందం, ఆరోగ్యం, మెరుగైన లైఫ్ స్టయిల్ టెక్నిక్స్ తన అభిమానులతో పంచుకుంటున్నారు. వంటింటి చిట్కాలు కూడా అందిస్తారు.

ఈ ఉపాసన యూట్యూబ్ ఛానల్‌క దాదాపు లక్షా 30 వేల మంది సబ్ స్క్రయిబర్స్ ఉన్నారండోయ్.. 2017 సెప్టెంబర్ లో ప్రారంభించిన ఈ ఛానల్ కు ఇప్పటి వరకూ కోటి కి పైగా వ్యూస్ వచ్చాయి. కేవలం హెల్త్ టిప్స్ మాత్రమే కాదు.. తన ఫ్యామిలీకి సంబంధించిన వివరాలు కూడా అప్ లోడ్ చేస్తున్నారామె.

అంతేకాదు.. సక్సస్ ఫుల్ పీపుల్ తో ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. మానసిక ఆరోగ్యం , శారీరక ఆరోగ్యం రెంటినీ మెరుగుపర్చుకునే అంశాల్లో విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. కొన్నిసార్లు ఈ విషయాల్ని పోషకాహార నిపుణులూ, సెలెబ్రిటీ షెప్లూ, ఫిట్నెస్ టైనర్లతోనే చెప్పిస్తున్నారు.

ఇప్పటివరకూ చిరంజీవి, సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్, సమంతా, పీవీ సింధు… ఇలా
చాలా మంది ప్రముఖుల జీవనశైలి గురించి ఇంటర్వ్యూలు చేశారు. ఉపాసన
ఇప్పటి వరకూ సుమారు 100 వీడియోల్ని అప్ లోడ్ చేశారు. ఓసారి మీరూ చూడండి. ఫిదా అవుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version