Urfi Javed: బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఉర్ఫీ జావేద్ డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఎవరు ధరించని విధంగా వింత విచిత్రమైన ప్రొడక్ట్స్ తో డ్రెస్ ధరించి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఉర్ఫీ జావేద్ తన పెదాలు మరింత అందంగా కనిపించాలని ఫిల్లింగ్ చేయించుకుంది. అయితే ఆమె ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది తన పెదాలు మరింత అందం పెరగడం పక్కన పెడితే అవి విపరీతంగా వాచిపోయి అంద వికారంగా తయారయ్యాయి.

తన పెదవులకి ఇంజక్షన్స్ తో చిన్నగా సర్జరీ చేయించుకుంది. ఆ బాధ ఎలా ఉంటుందో తెలియజేయడానికి ఉర్ఫీ జావేద్ ఈ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోగా అది వైరల్ గా మారుతుంది. ఆ ప్రమాదం నుండి బయటపడడానికి ఉర్ఫీ జావేద్ ఫిల్లింగ్ లను తీయించుకుంది. ఆ ప్రక్రియ కూడా ఆమెకు చాలా నొప్పిని కలిగించింది. మొత్తానికి ఈ ఫిల్లింగ్ కారణంగా ఉర్ఫీ జావేద్ కి చాలా కష్టం వచ్చింది. ఇలాంటి వీడియోను పోస్ట్ చేయడానికి కూడా కాస్త ధైర్యం కావాలంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఉర్ఫీ జావేద్ ఎలా ఉందో తెలుసుకోవాలని తన అభిమానులు ఆరాటపడుతున్నారు.