హరిహర వీరమల్లు పై కారుమూరి సునీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చింది.. కావాల్సిన రేట్లు పెట్టుకుంటున్నామని గొప్పగా సాధించినట్టు చెప్తున్నారని సీరియస్ అయ్యారు కారుమూరి సునీల్. సినిమాల సంగతి సరే.. మరి రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు కారుమూరి సునీల్.

మీ సినిమా టికెట్లు అమ్ముకుంటే ఎవరి కడుపు నిండుతుందని నిలదీశారు కారుమూరి. ఇక అటు పవన్ ‘హరిహర వీరమల్లు’ సినిమా ఫ్లెక్సీలు తొలగించారు. దింతో ఒంగోలులో మళ్లీ ఫ్లెక్సీల రగడ మొదలైంది. పవన్, బాలినేని ఫొటోలతో వెలశాయి సినిమా ఫ్లెక్సీలు. ఇక ఆ ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు మున్సిపల్ సిబ్బంది.