విమానంలో ఉర్ఫీ జావెద్​కు వేధింపులు.. నేను పబ్లిక్ ప్రాపర్టీ కాదంటూ బ్యూటీ ఫైర్

-

సోషల్ మీడియాలో ఉర్ఫీ జావెద్ పేరు తెలియని వారుండరు. ఈ బ్యూటీ తన డ్రెస్సింగ్ స్టైల్​కు చాలా ఫేమస్. హాట్ హాట్ ఫొటోలతో.. వెరైటీ ఔట్​ఫిట్స్​లతో తరచూ ఈ భామ నెట్టింట తెగ సందడి చేస్తుంది. రోజుకో రకమైన వింత ఔట్​ఫిట్​లో కుర్రాళ్ల మతిపోగొడుతుంది. అయితే తాజాగా ఉర్ఫీకి ఓ చేదు అనుభవం ఎదురైందట. ఈ విషయాన్ని ఈ అమ్మడు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకుంది.

తాను వినానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో తనను వేధించాడట. ఈ విషయాన్ని ఉర్ఫీ ఇన్​స్టా వేదికగా షేర్ చేసింది. ‘నిన్న ముంబయి నుంచి గోవాకు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో నేను వేధింపులకు గురయ్యాను. వీడియోలోని వ్యక్తులు నన్ను వేధింపులకు గురి చేశారు. ఈవ్ టీజింగ్ చేశారు. దీంతో నేను వారితో వాదించా. అప్పుడు అతను మద్యం తాగి ఉన్నాడని అతని స్నేహితులు చెప్పారు. తాగి ఉన్నా సరే ఇలా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని క్షమించలేం. నేను పబ్లిక్ ఫిగరే కానీ పబ్లిక్ ప్రాపర్టీని మాత్రం కాదు’ అంటూ చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version