పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలోనే వకీల్ సాబ్ 2

-

పవర్ స్టార్ పవన్ కల్యాన్ కు ఉన్న మార్కెట్ టాలీవుడ్ లో మరే హీరోకు లేదు. ప్లాప్ అయిన సినిమాలు కూడా కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టించిన చరిత్ర కూడా పవన్ కే సొంతం. సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన వకీల్ సాబ్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోందంటే పవన్ మానియా ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఈ మూవీ అన్ని రకాల ఆడియన్స్ కు నచ్చడంతో జనాలు కొవిడ్ ను కూడా లెక్కచేయకుండా థియేటర్లకు క్యూ కట్టారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయి రెండేళ్లు పూర్తి అయిన వేల వేణు శ్రీరామ్… ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ చెప్పారు. ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న వేణు శ్రీరామ్ మాట్లాడుతూ… నేను ప్రస్తుతం మూడు స్క్రిప్ట్ ల పై పని చేస్తున్నాను… అందులో వకీల్ సాబ్ 2 కూడా ఉంది. ఇది సీక్వెల్ కంటే అద్భుతంగా ఉంటుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version