తమిళ చలనచిత్ర పరిశ్రమలో వరలక్ష్మి శరత్ కుమార్ లాంటి ప్రతిభ కలిగిన చాలామంది నటీనటులకు సరైన ఆదరణ లేదు అని.. సొంత ఇండస్ట్రీ వారు పట్టించుకోవడం లేదు అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వరలక్ష్మి శరత్ కుమార్ వాపోయారు.తనకు కోలీవుడ్లో కంటే టాలీవుడ్ లో మంచి ఆదరణ ఉంది అని అందుకే హైదరాబాద్కు షిఫ్ట్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు ఆమె స్పష్టం చేసింది. ఇకపోతే ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కొండ్రాల్ పావం.. తెలుగులో పాయల్ రాజుపుత్ ప్రధాన పాత్రలో నటించిన అనుకోని అతిధి సినిమాకి రీమేక్ ఇది.
ఈ చిత్రానికి దయాళ్ పద్మనాభం దర్శకత్వం వహించగా మార్చి మూడవ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగానే సాగుతున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మీ శరత్ కుమార్ ఎన్నో విషయాలను పంచుకుంది.. వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. మల్లికా అనే పాత్రలో నేను నటించాను.. ఒక విభిన్నమైన మూవీలో నటించడం సంతోషంగా ఉంది. నేను తెలుగులో బిజీగా నటించడానికి కారణం అక్కడి ప్రేక్షకుల ఆదరణ తెలుగు చిత్రాలలో నేను చేసే ప్రతిపాత్రను వారు బాగా ఇష్టపడుతున్నారు .. గౌరవంతో పాటు ప్రేమాభిమానాలు కూడా చూపిస్తున్నారు.
తమిళ్ చిత్ర పరిశ్రమలో ఆ తరహా ఆదరణ కనిపించలేదు.. ఒకరకంగా చెప్పాలి అంటే మాలాంటి ఎంతోమంది నటీమణులను కోలీవుడ్ పరిశ్రమ పక్కన పెట్టేసింది అందుకే నేను హైదరాబాదుకు షిఫ్ట్ అవ్వాలని భావిస్తున్నాను. నెగటివ్ పాత్రలు ఎక్కువగా చేస్తున్నారనే విమర్శలు వచ్చినా .. దానికి దిగులేం లేదు.. నిజం చెప్పాలంటే ఇతర నటీమణులు ను ఆశ్చర్యపోయే పాత్రలలో నటించానని చెప్పగలను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. మొత్తానికైతే కోలీవుడ్ కి ఈ ముద్దుగుమ్మ గుడ్ బాయ్ చెప్పబోతోంది అని చెప్పవచ్చు.