రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ రెచ్చగొట్టడమే తెలుసు.. ఎదుటి వారు రెచ్చిపోతే యమ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలాంటి వర్మకు చిర్రెత్తే ప్రశ్న వేశారు ఒక యాంకర్. అమ్మాయిల జీవితాల్ని నాశనం చేశారని, వాడుకుంటారనే ఆరోపణలు మీపై ఉన్నాయి. అవి ఎంతవరకు నిజం? అంటూ వేసిన ప్రశ్నకు వర్మ ‘అసలు ఆ విషయం ఎవరు చెప్పారు మీకు? రోడ్డుమీద ఎవడో ఏదో అనుకుంటే నమ్మేస్తారా?. పర్సనల్ లైఫ్ గురించి అడగడానికి నువ్వెవరు?” అంటూ ఆవేశంతో ఊగిపోయాడు.
“పవర్ స్టార్” సినిమా గురించి ఏమైనా అడగండి.. అంతే కానీ ‘‘నా పర్సనల్ లైఫ్ నా సెక్స్ లైఫ్ గురించి ఇంటర్వ్యూ ఇచ్చేందుకు కాదు ఇక్కడికి వచ్చింది. పర్సనల్ విషయాల జోలికి వెళ్లొద్దు. ఏ అమ్మాయైనా వచ్చి నీతో చెప్పిందా ఆర్జీవీ నా జీవితం నాశనం చేశాడని? అయితే నేను చెప్పాలి.. లేదా ఓ అమ్మాయి చెప్పాలి.’’ అంటూ మైక్ పడేసి వెళ్ళిపోయాడు.
ఇదంతా చదివిన మీకు కొంచెం కొత్తగా అనిపించొచ్చు.. ఎందుకంటే ఏ ప్రశ్నకైనా వెటకారంగా సమాధానమిచ్చే వర్మకు కౌంటర్ పడటమేంటా అని. నిజమే ఎప్పుడూ ఎదుటి వారిని గిల్లుతూ, వారి పర్సనల్ లైఫ్‌ను థియేటర్స్‌లోకి ఎక్కించే వర్మకి తన పర్సనల్ విషయాలు అడగవద్దనే హక్కు ఉందా?? అంటూ పవన్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఏదో ఎందుకు ప్రస్తుతం ఇంటర్వ్యూ ఇస్తానని వచ్చిన సినిమానే వేరే వారి పర్సనల్ జీవితం గురించి తీసినదే కదా..? మరి నీ పర్సనల్ విషయాలు అడిగితే ఎందుకంత గింజుకుంటున్నావంటూ సెటైర్లు వేస్తున్నారు. వర్మకు “ఆవేశం స్టార్” అంటూ బిరుదులు ఇచ్చేస్తున్నారు.. అంతేనా వర్మకు పంచ్ ఇచ్చిన యాంకర్‌కు సన్మానం చేసే పనిలో ఉన్నారట “ప్రవన్ కళ్యాన్” ఫ్యాన్స్..
అంతేలే మనదాకా వస్తే గానీ తెలియదు.. అది వర్మకు వర్తించదేమో అనుకున్నామ్ కానీ.. ఎంతైనా వర్మ కూడా మనిషే??? గా.