ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ గడచిన 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను తాజా బులెటిన్ ద్వారా విడుదల చేసింది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 43,127 శాంపిల్స్ ను పరీక్షించగా అందులో మొత్తం 6051 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించడం జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష మార్క్ దాటి 1,02,349 కు చేరుకున్నాయి.
#COVIDUpdates: 27/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 99,454 పాజిటివ్ కేసు లకు గాను
*46,681 మంది డిశ్చార్జ్ కాగా
*1090 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 51,683#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/vyn03RbsYU— ArogyaAndhra (@ArogyaAndhra) July 27, 2020
అలాగే నిన్న రాష్ట్రవ్యాప్తంగా 3234 మంది కరోనా నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో హాస్పిటల్స్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 51,701 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. తాజాగా కరోనా బారినపడి 49 మంది మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 1090 కు చేరుకుంది. ఇక ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,86,446 శాంపిల్స్ ను పరీక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నతాధికారులు కరోనా నివారణకు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి రాష్ట్రంలో లక్ష కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ముఖ్యంగా తూర్పుగోదావరి, కర్నూల్, గుంటూరు, అనంతపూర్ జిల్లాలో కరోనా వైరస్ ఉదృతి ఎక్కువగా ఉంది.