రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా “వరుడు కావలెను” టీజర్

-

యంగ్‌ టాలీవుడ్‌ హీరో నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న సినిమా వరుడు కావలెను. సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా… లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు మరియు సాంగ్స్ తో ఓ రేంజ్‌ లో రెస్పాన్స్‌ వచ్చింది. లుక్‌ పరంగా హీరో నాగశౌర్య మరియు హీరోయిన్‌ రీతూ వర్మ ఇద్దరూ కూడా మంచి మార్కులు కొట్టేశారు.ఈ నేపథ్యంలో తాజాగా ఈ వరుడు కావలెను సినిమా నుంచి మరో అప్డేట్‌ వచ్చింది.

ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలింది చిత్ర బృందం. ఇక ఈ సినిమా టీజర్ విషయానికి వస్తే… పూర్తిగా రొమాంటిక్ యాంగిల్ లో నడిచే కథాంశంగా మనకు అర్థమవుతోంది. హీరోయిన్ ను పెళ్లి కోసం.. ఆమె ఫ్యామిలీ చూడటం… ఇంతలోనే హీరో ఎంట్రీ ఇవ్వడం లాంటి సంఘటనలు ఈ టీజర్ లో మనకు కనిపించాయి. ఇక హీరో హీరోయిన్ల మధ్య జరిగే సన్నివేశాలను ఈ టీజర్ లో చూపించారు. అలాగే వారి ఇద్దరి మధ్య రొమాంటిక్ యాంగిల్ కూడా చూపించారు. ఇక ఈ టీజర్.. చూశాక సినిమా పై మరింత అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. కాగా ఈ సినిమాను అక్టోబర్ మాసంలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version