మహేష్ మల్టీప్లెక్స్ లో మెగా హీరో ఈవెంట్

-

సూపర్ స్టార్ మహేష్ ఏ.ఎం.బి సినిమాస్ ఈమధ్యనే మొదలైంది. ఆసియన్ శ్రీనివాస్ తో కలిసి మహేష్ మొదలుపెట్టిన ఈ మల్టీప్లెక్స్ లో మొదటి ఈవెంట్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న అంతరిక్షం మూవీది కానుంది. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ఏ.ఎం.బి సినిమాలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కూడా ఏ.ఎం.బి సినిమా మాల్ లో జరుగనుందట.

ఈ మల్టీప్లెక్స్ లో జరుగబోతున్న మొదటి ఈవెంట్ ఇదే అవడం విశేషం. సంకల్ప్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా స్పేస్ కాన్సెప్ట్ తో వస్తుంది. డిసెంబర్ 21న రిలీజ్ అవుతున్న ఈ మూవీ లో వరుణ్ తేజ్ సరసన అదిరి రావు హైదరి, లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు.

ఫిదా, తొలిప్రేమ హిట్ సినిమాల తర్వాత వరుణ్ తేజ్ నుండి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఘాజి సినిమాతో సత్తా చాటిన సంకల్ప్ రెడ్డి అంతరిక్షం కూడా అంతే అద్భుతంగా తెరకెక్కించి ఉంటాడని ప్రేక్షకులు భావిస్తున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో డిసెంబర్ 21న తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version