వరుణ్​ తేజ్​-లావణ్య త్రిపాఠి పెళ్లి డేట్​ లాక్!

-

మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగే సమయం దగ్గరపడింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. డింపుల్ బ్యూటీ లావణ్య త్రిపాఠి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. జూన్‌ 9వ ఈ జంట నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వరుణ్​-లావణ్య పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరగబోతుందనే విషయంపై మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ వ్యవహారంపై రోజుకో వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

అయితే తాజాగా ఈ జంట వివాహం ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్​ పద్ధతిలో జరగనున్నట్లు తెలిసింది. వారి ప్రేమ చిగురించిన చోటు ఇటలీలోనే పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని ఈ జంట నిర్ణయించుకుందట. నవంబర్ 1వ తేదీని వివాహం కోసం లాక్​​ చేసినట్లు సమాచారం. ఇరు కుటుంబల సమక్షంలో మూడు రోజుల పాటు డెస్టినేషన్ వెడ్డింగ్ పద్ధతిలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుక కోసం మెగా ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్లనున్నారట. కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్​ మాత్రం ఒక్కరే బిజీ షెడ్యూల్ కారణంగా హాజరుకాకపోవచ్చని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version