మెదక్ జిలాల్లో 10కి 10 గెలిచి సీఎం కేసీఆర్ కు గిఫ్ట్ ఇస్తా – మంత్రి హరీష్ రావు

-

మెదక్ జిలాల్లో 10కి 10 గెలిచి సీఎం కేసీఆర్ కు గిఫ్ట్ ఇస్తామని ప్రకటించారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. రేపు సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాకు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సభ ఏర్పాట్లు చూసుకుంటున్నారు హరీష్‌రావు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. బీజేపీ కి క్యాడర్ లేదు…కాంగ్రెస్ కి లీడర్ లేరని ఫైర్‌ అయ్యారు.

బిజెపీ మా పార్టీలో టికెట్ రాని అభ్యర్థుల కోసం ఎదురు చూస్తోందని.. మేము టికెట్ ఇయ్యకపోతే బీజేపీ వాళ్ళు పార్టీలోకి చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు.మా పార్టీకి బలం రైతులు, యువత అని.. కేంద్ర ప్రభుత్వం మా పథకాలను కాపీ కొట్టిందని చురకలు అంటించారు. కుల వృత్తులకు మేం ఉచితంగా సహాయం చేస్టే బిజెపి కాపీ కొట్టి అప్పుగా ఇస్తారని పేర్కొన్నారు. కేసీఆర్ వ్యూహానికి ప్రతిపక్షాలు కాకవికాలం అయ్యాయని.. కేసీఆర్ పై దుష్ప్రచారం చేసే ప్రతిపక్షాలు గెలుస్తామని చెప్పడం అవివేకం అంటూ నిప్పులు చెరిగారు మంత్రి హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version