బ్రిటీష్ కాలం కథలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఓ మూవీ చేస్తున్నాడు. గత కొంత కాలంగా ఫ్యామిలీ స్టోరి, లవ్ స్టోరీ, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథలతో సినిమాలు చేసిన విజయ్ సరైన విజయాన్ని దక్కించుకోలేకపోయాడు. గీతా గోవిందం సక్సెస్ తరువాత మరో సరైన కమర్షియల్ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే రెగ్యులర్ కథలకు స్వస్తీ చెప్పి డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నాడు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు.
వేసవికాలంలో ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో టాక్సీవాల్ ఫేమ్ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ఓ చేసేందుకు అంగీకరించాడు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. బ్రిటీష్ కాలం నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనుందట. 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉండనుంది. ఈ సినిమా కోసం ప్రత్యేక సెట్ నిర్మిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. మైత్రీ మూవీస్ మేకర్స్ పతాకం నవీన్ యేర్నేని, రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. vd14 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.