డైరెక్టర్ గదిలోకి పిలిచాడు : విద్యాబాలన్

-

విద్యాబాలన్… భారతదేశ నటీమణులలో చెప్పుకోతగ్గ హీరోయిన్ ఈవిడ. పాత్రకు తగ్గట్టు హావభావాలు పలికించడం ఆమెకు సొంతం. ఓవైపు గ్లామర్ రోల్స్ లో యువతను అలరిస్తూనే, మరోవైపు సీరియస్ పాత్రలో తన నటనా ప్రావీణ్యాన్ని చూపించగల వ్యక్తి ఆవిడ.

అయితే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ బ్యూటీ. తాను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ వెల్లడించారు. ‘గతంలో ఓ యాడ్ ఫిల్మ్ కోసం డైరెక్టర్ ను కలవడానికి చెన్నై వెళ్లాం. కాఫీ షాప్ లో కలుద్దామని చెప్పగా, ఆయన నన్ను గదిలోకి వెళ్లి మాట్లాడుకుందాం అని ఒత్తిడి తెచ్చాడు. అతడి ఆలోచన అర్థమయ్యే గదిలోకి వెళ్లాక డోర్ లాక్ చేయకుండా కొంచెం తెరిచి ఉంచా. దీంతో అతడు ఏమి మాట్లాడకుండా ఐదు నిమిషాల తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు’ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news