రెండు రోజుల క్రితం దక్షిణాదిన విడుదలైన రెండు అతిపెద్ద చిత్రల్లో `బిగిల్` ఒకటి. అయితే బిగిల్ చిత్రాన్ని కూడా పైరసీ వదల్లేదు. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఆన్ లైన్లో ప్రత్యక్షమైయ్యాయి. ఈ చిత్రంతో పాటు కార్తీ హీరోగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో డ్రీమ్వారియర్, వివేకానందా స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మించిన ఖైదీ చిత్రం ఒకే సారి విడుదలయ్యాయి. అయితే ఈ చిత్రానికి కూడా పైరసీ దెబ్బ తగిలింది.
దీంతో చిత్ర వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ రెండు చిత్రాలు హిట్ టాక్ ను తెచ్చుకుని, విమర్శకుల ప్రశంసలను అందుకున్నాయి. అయితే ‘బిగిల్’ (తెలుగులో విజిల్) విడుదలైన గంటల వ్యవధిలోనే ఆన్ లైన్ లో కనిపించగా, శుక్రవారం రాత్రి ‘ఖైదీ’ ఆన్ లైన్ లో లీకైంది. ఈ చిత్రాలను ఆన్ లైన్ లో ప్రచారం చేయరాదని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా, అవి భేఖాతరు అయ్యాయి.