దీపావళి సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ బంప‌ర్‌ ఆఫర్‌..

-

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ దీపావళి పండుగ సందర్భంగా బంఫర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ విషయమై ఆ సంస్థ చెన్నై డైరెక్టర్‌ వివేక్‌బచ్చల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. వినియోగదారులను ఆకట్టుకు నేందుకు దీపావళి పండుగ సందర్భంగా ఉచితంగా అన్‌ లిమిటెడ్‌ టాక్‌టైమ్‌ ప్యాకేజీని ఇస్తున్నట్టు తెలిపారు.

ఈ ప్యాకేజీ ప్రకారం వినియోగదారులు దేశంలోని ఏ ప్రాతం లో ఉన్న తమ స్నేహితులు, కుటుంబీకులతో టెలిఫోన్‌ ద్వారా అన్‌ లిమిటెడ్‌గా మాట్లాడుకోవచ్చన్నారు. ఎస్‌ఎంఎస్‌లు కూడా ఫ్రీ అని తెలిపారు. ఆది, సోమవారాలు రెండు రోజుల పాటు ఈ ఆఫర్‌ను వినియోగించు కోవచ్చని ఆయన సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version