సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ డైలాగ్ వైరల్

-

లైగర్ ఫ్లాప్​తో విజయ్ దేవరకొండ కోలుకోలేని దెబ్బ తిన్నాడు. ఇప్పుడిప్పుడే కాస్త యాక్టివ్​గా ఉంటూ బయట కనిపిస్తున్నాడు. మరోవైపు సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటున్నాడు. తాజాగా ఈ యువ హీరో ట్విటర్​లో తన అభిమానులతో ముచ్చటించాడు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. అందులో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు విజయ్ చెప్పిన డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘‘మర్చిపోలేని ఒక్క హిట్‌ ఇవ్వన్నా’’ అని ఓ అభిమాని అడగ్గా.. దానికి స్పందించిన విజయ్‌ ‘‘’హిట్ ఒక్కటే పెండింగ్ రా.. త్వరలో కొట్టేద్దాం’’’ అని అన్నాడు. ఇక ఈ వీడియోను విజయ్‌ ఫ్యాన్స్‌ షేర్‌ చేస్తూ ‘ఖుషి’ సినిమాతో కచ్చితంగా సూపర్‌ హిట్‌ వస్తుందని కామెంట్స్‌ పెడుతున్నారు.

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ కూడా తన ఆశలన్నీ ‘ఖుషి’ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఇందులో విజయ్‌ సరసన అగ్ర కథానాయిక సమంత నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ 60 శాతం పూర్తయింది. మిగిలిన భాగం చిత్రీకరణ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version