పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం తీసుకున్నా మాకు ఓకే : వైసీపీ ఎమ్మెల్సీ

-

జగన్ సభకు వస్తే ప్రభుత్వం కూటమి భయపడుతోంది అని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి అన్నారు. అయితే మా 11 మంది సభ్యులను చూస్తే ప్రభుత్వానికి ఎందుకంత భయం. శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ బాధ్యతగా వ్యవహరిస్తోంది. మేము ప్రజా సమస్యల పై రాజీలేని పోరాటం చేస్తున్నాం. అందుకే శాసనసభలో కూడా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని మాత్రమే మేము కోరుతున్నాం.

ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలో ఉన్నాయి. మిగిలిన వైసీపి ఒక్కటే ప్రతిపక్షం కోసం పని చేస్తోంది. మేము కేవలం ప్రజా సమస్యలపై మాట్లాడటానికి అవకాశం కల్పించమని మాత్రమే అడుగుతున్నాం. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి.. కూటమి నుండి బయటకు వచ్చి ప్రతిపక్షంగా తీసుకున్నా మాకు ఓకే. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపటానికి ఒక ప్రతిపక్షం ఉండాలని మాత్రమే మేము కోరుకుంటున్నాం. 1977లోనే‌ పార్లమెంటు రూపొందించిన చట్టం ప్రకారమే‌ మేము అడుగుతున్నాం అని వైసీపీ ఎమ్మెల్సీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version