ఆ విషయం నా పరిధిలో లేదు.. మనోజ్ పెళ్లిపై మంచు లక్ష్మి వైరల్ కామెంట్స్..

-

మంచు లక్ష్మి తాజాగా మంచు మనోజ్ భామా మౌనిక పెళ్లిపై వైరల్ కామెంట్స్ చేశారు. మనోజ్ పెళ్లి ఎప్పుడు అంటూ మీడియా ప్రశ్నించగా ఆ విషయం నా పరిధిలో లేదు అంటూ అసహనానికి గురయ్యారు..భామా మౌనిక మంచు మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ సన్నిహితంగా మీడియా కంట పడుతూనే వస్తున్నారు. అయితే ఇప్పటివరకు వీరు పెళ్లికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయితే ముందు నుంచి ఈ పెళ్లి ఇరు కుటుంబాలకు ఇష్టం లేదన్న వార్తలు వినిపిస్తూనే వస్తున్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై మంచు లక్ష్మి స్పందించారు..

 

శ్రీకాళహస్తి దర్శనానికి వచ్చిన మంచు లక్ష్మిని మీడియా మంచు మనోజ్ పెళ్లి పై ప్రశ్నల వర్షం కురిపించారు. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు కదా.. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అంటూ ఒక్కసారిగా చుట్టుముట్టి ప్రశ్నించగా మంచు లక్ష్మి ఒకింత అసహనానికి గురయ్యారు.. గుడిలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి విషయాలు మాట్లాడటం తగిన విషయం కాదు అంటూ చెప్పకువచ్చారు. అలాగే మనోజ్ పెళ్లి తనకు సంబంధం లేదని అన్నారు. అంతేకాకుండా నా పరిధిలో ఉన్న విషయాలు కోసం మాత్రమే నేను మాట్లాడగలను ఆ పెళ్లి నా పరిధిలో లేదు అంటూ చెప్పుకు వచ్చారు..

ప్రస్తుతం ఈ మాటలు చర్చనీయంశంగా మారాయి.. మనోజ్, మౌనికను రెండో పెళ్లి చేసుకోవడం మంచు కుటుంబానికి ఇష్టం లేదు అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మంచు లక్ష్మి స్పందించిన తీరు చూస్తే ఇది నిజమేనని అనుకుంటున్నారు అభిమానులు.. అయితే భామా మౌనిక కూడా ముందు పెళ్లయి విడాకులు తీసుకున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version