‘ఫ్యామిలీ స్టార్’ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో

-

పరశురాం దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ . మృణాళ్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ మూవీ ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Family Star 

ఇదిలా ఉంటే…ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో వచ్చేసింది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలోని ‘కళ్యాణి వచ్చా వచ్చా..’ అంటూ సాగే వెడ్డింగ్ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. పూర్తి సాంగ్ సాయంత్రం 6.30 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు. ఇదివరకే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ , ఫస్ట్ లుక్ కి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version