ప్రభాస్‌ను వెనక్కి నెట్టేసిన విజయ్.. రౌడీ స్టార్ క్రేజ్ మామూలుగా లేదే!

-

రౌడీ స్టార్, రౌడీ హీరో, టాలీవుడ్ సెన్సేషన్, సెన్సేషనల్ స్టార్ ఇలా ఏ ట్యాగ్ ‌లైన్‌తో పిలిచినా అందరికీ గుర్తొచ్చేది ఒక్క విజయ్ దేవరకొండనే. పెళ్లి చూపులు సినిమాతో అందరి దృష్టిని ఆకర్శించిన విజయ్.. అర్జున్ రెడ్డి చిత్రంతో ఆకాశమంతా ఎత్తుకు చేరుకున్నాడు. ఆపై గీతగోవిందం, నోటా, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలతో అభిమానులను పలకరించాడు.

సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా విజయ్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది.డియర్ కామ్రేడ్ ఘోర పరాజయం పొందినా.. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా డిజాస్టర్‌గా మిగిలినా విజయ్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. తాజాగా హైద్రాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబులో మెన్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఇందులో ఏ ఏ హీరోలు ఏ ఏ స్థానంలో ఉన్నారో ఓ సారి చూద్దాం.

ఈ జాబితాలో విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ టాప్ స్టార్‌లను వెనక్కి నెట్టేశాడు. ఇండియన్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను వెనకపడేశాడు. ఈ లిస్ట్‌లో విజయ్ దేవరకొండ మొదటి స్థానంలో, రామ్ చరణ్ రెండో స్థానం, ప్రభాస్ నాల్గో స్థానంలో ఉన్నాడు. టాప్ 30లో విశ్వక్‌సేన్ చివరి స్థానంలో నిల్చున్నాడు. గతేడాది జాబితాలోనూ విజయ్ మొదటి స్థానంలోనే ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version