మరోసారి రష్మిక తో రొమాన్స్ చేయనున్నారు విజయ్ దేవరకొండ. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న రిలేషన్షిప్లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట మాత్రం ఎప్పుడూ ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. కాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ – రాహుల్ సంకృత్యాన్ కాంబోలో ఓ మూవీ రానున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాను దిల్‌రాజు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ SMలో వైరలవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై మైత్రీ మేకర్స్ నుంచి హింట్ వచ్చినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.