భర్త కళ్లెదుటే భార్యకు వేధింపులు.. బీర్ బాటిళ్లతో అడ్డగించి!

-

భర్త కళ్లెదుటే భార్యను కొందరు ఆకతాయిలు వేధించారు. హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. కొందరు కామాంధులు భర్త కళ్లెదుటే భర్యను నోటికొచ్చినట్లు అసభ్యకర మాటలతో రెచ్చిపోయారు.కాసేపు నన్నే నీ భర్త అనుకో.. నీ ఫోన్ నంబర్ ఇవ్వు అంటూ దారికి అడ్డంగా నిలబడి బీరు బాటిళ్లతో హంగామా చేసి బెదిరింపులకు పాల్పడ్డారు.

బాధిత వివాహిత తన భర్త, మరిది, ఆడపడుచుతో కలిసి గతరాత్రి బేగంపేటలోని ఒక పబ్‌కి వెళ్లి 11.30 గంటలకు తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగింది. ఎస్సార్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద భర్తపై ముగ్గురు యువకులు దాడి చేసి.. వివాహితను వెంబడించారు.తప్పించుకున్న వివాహిత 100కు డయల్ చేసింది.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ముగ్గురు యువకులు డి.సంపత్ (28), సందీప్ (28), కూకట్ పల్లికి చెందిన ఉమేష్ (28)లను అరెస్ట్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news