గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రుషికొండను మొత్తం తొలిచి ప్రభుత్వ భవనాలు, అతిథి గృహాలు నిర్మించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నాటి ప్రభుత్వాన్ని అన్ని పార్టీలు కలిపి దూషించాయి.పర్యావరణాన్ని జగన్ సర్కార్ నాశనం చేస్తున్నదని విమర్శలు చేశాయని మరి ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
‘అప్పుడు జగన్‌ని తిట్టారు.. ఇప్పుడు ఈ నిర్మాణాలేంటి? వైజాగ్‌లోని రుషికొండపై నిర్మాణాలు చేపట్టినందుకు జగన్‌పై విమర్శలు చేశారు? ఇప్పుడు అదే ప్రాంతంలో వెలుస్తున్న విలాసవంతమైన ప్రైవేట్ విల్లాలు.. అప్పుడు జగన్‌ది తప్పైతే.. ఇప్పుడు వీటికి ఏపీ సర్కార్ ఎలా అనుమతి ఇచ్చింది? అంటూ’ జనం ప్రశ్నిస్తున్నారని నెట్టింట ఓ ట్వీట్ సంచనలంగా మారింది.