సితార ఎంటర్ టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ-భాగ్య శ్రీ భోర్సె జంటగా తెరకెక్కుతున్న చిత్రం కింగ్డమ్. ఇందులో సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో బ్రదర్ ఎమోషన్ తో కింగ్డమ్ మూవీ రానుంది.
తిరుపతిలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. కొన్ని సాంకేతిక కారణాలతో ట్రైలర్ ఆలస్యంగా విడుదల అయింది. ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం అండర్ కవర్స్ స్పై గా మారాలి అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. స్పై గా మారాలంటే అమ్మని, ఇల్లుని, ఊరు, ఉద్యోగం అన్ని వదిలేయాలి. నువ్వు అడుగు పెట్టబోయే ప్రపంచం.. నువ్వు కలవబోయే మనుషులు, నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితులు చాలా రిస్క్ ఆపరేషన్ సూరి అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. విజయ్ నటన, డైలాగ్స్, బీజీఎం, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై హైప్ పెంచాయి. ఈ చిత్రం జులై 31న విడుదలవ్వనుంది.