సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా సింగపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తో పాటు ఆయన బృందానికి అక్కడి తెలుగు ప్రజలు సంప్రదాయ వస్త్రధారణతో తరలివచ్చి నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. సీఎం బృందానికి స్వాగతం పలికిన వారిలో పలువురు పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలు సైతం ఉన్నారు. 

5 రోజుల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు 29 సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇక ఇవాళ ఉదయం 11.30 గంటలకు సుర్బానా -జురాంగ్ సంస్థ ప్రతినిధులతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఎవర్ సెండాయ్ ఇంజినీరింగ్ ప్రైవేల్ లిమిటేడ్ చైర్మన్ శ్రీడాటోనాథన్ ఎలుమలైతో వాణిజ్య అంశాలపై చర్చిస్తారు.  మధ్యాహ్నం 2 గంటలకు తెలుగు డయాస్ పోరా సమావేశానికి ఆయన బృందంతో పాటు ఆయన హాజరు కానున్నారు. సాయంత్రం భారత హై కమిషనర్ నివాసంలో విందుకు హాజరవుతారు. 

Read more RELATED
Recommended to you

Latest news