విజయ్ ‘జననాయకన్’ సెకండ్ లుక్ అదుర్స్

-

దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “జన నాయకన్”. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ అవైటెడ్ సినిమా విజయ్ కెరీర్ లో చివరి సినిమా కావడంతో అభిమానులు ఒకింత ఎమోషనల్ గా కూడా దీనికి అటాచ్ అయ్యి ఉన్నారు. అయితే ఇపుడు లేటెస్ట్ గా మేకర్స్ ఈ సినిమా నుంచి విజయ్  ఫస్ట్ లుక్ అండ్  సెకండ్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ కి తీసుకొచ్చారు.

అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ లో చిల్ గా కనిపించిన దళపతి సెకండ్ లుక్ లో కూడా అదే మూడ్ లో కనిపిస్తూ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇస్తున్నాడని చెప్పాలి. మరి ఒక ఫ్రేమ్ లాంటిది ఉంటే అందులో కొరడా పట్టుకొని విజయ్ చాలా సింపుల్ గా కనిపిస్తున్నాడు. ఇలా మేకర్స్ అయితే సింపుల్ అండ్ కూల్ గా ఫ్యాన్స్ కి తమ హీరోని ప్రెజెంట్ చేస్తున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా కన్నడ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news