ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలి : నందమూరి బాలకృష్ణ

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత నటుడు తన తండ్రి నందమూరి తారకరామారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని నటుడు బాలకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ” నాకు పద్మ భూషణ్ పురస్కారం దక్కడం చాలా సంతోషంగా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. దీనిని బిరుదుగా కంటే బాధ్యతగా భావిస్తున్నాను. ఎన్టీఆర్ తనయుడిగా పుట్టడం నా అదృష్టం. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరుతున్నాను. ఇది తెలుగు ప్రజలందరి కోరిక” అని వెల్లడించారు బాలకృష్ణ. 

సినిమాల ద్వారా సందేషాత్మక చిత్రాల్లో నటిస్తున్నాను. క్యాన్సర్ ఆసుపత్రికి 15 సంవత్సరాలుగా చైర్మన్ గా కొనసాగుతున్నాను. అలాగే హిందూపూర్ ఎమ్మెల్యేగా మూడు పర్యాయాల నుంచి కొనసాగుతున్నాను. ముఖ్యంగా ఎంతో మంది ఉన్నారు. నా వెనుక బలగం, బలం. హిందూపూర్ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ ప్రతిరూపాన్ని నాలో చూసుకునేందుకు అవకాశం కల్పించినందుకు మా తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ధన్యవాలు. విశ్వనటరూపం ఎలా ఉంటుందో చూపించిన కారుణ్య జన్ముడు. కేవలం తండ్రి మాత్రమే కాదు.. ముందుకెల్లడానికి మార్గదర్శకుడు అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news