వైజయంతి ఐపీఎస్ ఈజ్ బ్యాక్.. పోలీస్​ ఆఫీసర్​గా విజయశాంతి ​పవర్​ఫుల్ గ్లింప్స్​

-

టాలీవుడ్ లేడీ సూపర్​స్టార్ విజయశాంతి పోలీస్​ ఆఫీసర్​గా చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. పవర్​ఫుల్ కాప్ వైజయంతి పాత్రలో ఆమె మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్నారు. నందమూరి కల్యాణ్​రామ్ చిత్రం కోసం ఈ రాములమ్మ మళ్లీ పోలీసు అవతారం ఎత్తారు. క‌ల్యాణ్‌రామ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ NKR21. యాక్షన్​ జానర్‌లో రానున్న ఈ చిత్రంతో ప్రదీప్ చిలుకూరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఇవాళ (జూన్​ 24) విజ‌య‌శాంతి పుట్టినరోజు సంద‌ర్భంగా ఈ మూవీలో రాముల‌మ్మ ఫ‌స్ట్ లుక్‌తో పాటు స్పెష‌ల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్​. ఈ గ్లింప్స్​లో విజయశాంతి వైజయంతి అనే పవర్ ఫుల్ పోలీసు పాత్రలో కనిపించారు. ఆమె పాత్రను కల్యాణ్ రామ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. “వైజ‌యంతి ఐపీఎ. తను పట్టుకుంటే పోలీసు తుపాకీకి ధైర్యం వస్తుంది. వేసుకుంటే యూనిఫామ్​కు పౌరుషం వస్తుంది. తనే ఒక యుద్ధం. నేనే తన సైన్యం” అంటూ విజయ శాంతిని ఉద్దేశిస్తూ కల్యాణ్ రామ్​ చెప్పే డైలాగ్​ గూస్​ బంప్స్​ తెప్పిస్తోంది. ఈ సినిమాను అశోక క్రియేషన్స్ నిర్మిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version