MLA సంజయ్.. కాంగ్రెస్ లో చేరడం వెనుక పెద్ద కుట్రే ఉంది – ఎల్‌ రమణ

-

MLA సంజయ్.. కాంగ్రెస్ లో చేరడం వెనుక పెద్ద కుట్రే ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు BRS MLC ఎల్‌ రమణ. ఇవాళ తెలంగాణ భవన్ లో BRS MLC ఎల్‌ రమణ మాట్లాడుతూ…. నిన్న అర్ధరాత్రి జగిత్యాల BRS MLA సంజయ్ కాంగ్రెస్ లో చేరడం అనైతికం అన్నారు. పార్టీలో చేరిక వెనుక లోపాయికారీ ఒప్పందం ఏంటో? చెప్పాలని ఆగ్రహించారు. జగిత్యాల లో ప్రతి ఒక్కరూ తప్పు అని అంటున్నారు….ప్రజా కోర్టులో సంజయ్ కు శిక్ష పడడం ఖాయం అని హెచ్చరించారు.

l ramana slams jagitial mla sanjay

రాహుల్ గాంధీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేసేలా చట్టం తెస్తాం అని అన్నారన్నారు BRS MLC ఎల్‌ రమణ. రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ ది ద్వంద నీతి అంటూ నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ మాటలకు విలువ లేదా ? బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇదే కాంగ్రెస్ ఎంఎల్ఏ లు పార్టీ మారితే అనర్హత వేటు వేయాలని పట్టుబట్టిందని మండిపడ్డారు BRS MLC ఎల్‌ రమణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version